Andhra Pradesh: ఉత్తరాంధ్ర తీరంలో నేడు అల్లకల్లోలంగా సముద్రం.. హెచ్చరికలు జారీ!

  • నైరుతి రుతుపవనాల ప్రభావం
  • నాలుగు మీటర్ల ఎత్తున ఎగసిపడనున్న అలలు
  • గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు

ఉత్తరాంధ్ర తీరంలో నేడు, రేపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి రుతుపవనాల కారణంగా తీరప్రాంతాల్లో సముద్రపు అలలు నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించింది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉద్ధృతంగా వీస్తాయని పేర్కొంది.  

More Telugu News