Tollywood: నేను ఏది కొన్నా అది మీ అభిమానం వల్లే!: హీరో అల్లు అర్జున్

  • అభిమానుల ప్రేమవల్లే ఈ స్థాయిలో ఉన్నా
  • ఏది కొన్నా అది ఫ్యాన్స్ వల్లే
  • నేను వారికి ఎప్పటికీ రుణపడే ఉంటాను
  • కొత్త వ్యానిటీ వ్యాన్ ఫొటోలను పోస్ట్ చేసిన బన్నీ
అభిమానులు కురిపించిన ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలిపాడు. వాళ్ల ప్రేమతోనే తాను ఇప్పుడు ఏదైనా  కొనుగోలు చేస్తున్నానని అన్నాడు. ఈ అభిమానానికి తాను రుణపడి ఉంటానని బన్నీ అన్నాడు. జీవితంలో తాను ఏది కొన్నా అది అభిమానుల వల్లేనని స్పష్టం చేశాడు. ఇటీవల తాను కొనుగోలు చేసిన వ్యానిటీ వ్యాన్ ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు. దీనికి ఫాల్కన్ అని బన్నీ పేరు పెట్టాడు. ఈ ఫొటోలను మీరూ చూసేయండి.
Tollywood
Allu Arjun
vanity van
falcon
Twitter

More Telugu News