Union Budget: ఏపీ ఆశలపై నీళ్లు చల్లిన కేంద్ర బడ్జెట్

  • కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలు
  • రెండు యూనివర్శిటీలకు స్వల్ప కేటాయింపులు
  • అమరావతి, ప్రాజెక్టుల ఊసే లేదు
కేంద్ర బడ్జెట్లో ఏపీకి న్యాయం జరుగుతుందని అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఏపీ పట్ల చిన్న చూపు చూసింది. ఏపీలోని సెంట్రల్ యూనివర్శిటీకి రూ. 13 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ. 8 కోట్లు కేటాయించినట్టు తెలిపింది. రాష్ట్రంలోని ఇతర యూనివర్శిటీలకు మొండి చేయి చూపింది. నిట్, ఐఐఎం, ఐఐటీలకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. దీంతో, వీటి నిర్వహణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఏపీలోని ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం తదితర అంశాల ఊసు కూడా బడ్జెట్ లో లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పై ఏపీ ప్రజలు పెదవి విరుస్తున్నారు. 
Union Budget
Andhra Pradesh

More Telugu News