ఇకపై ఎన్నారైలకు సత్వరమే ఆధార్ కార్డులు.. కొత్తగా నాలుగు ఎంబసీల ఏర్పాటు!: నిర్మలా సీతారామన్
- 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
- అంధులు కూడా గుర్తించేలా రూ.1, 2, 5, 10, 20 నాణేలు
- ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ
ఈ బడ్జెట్ హైలైట్స్..
- ఎన్నారైలు 180 రోజులు ఎదురుచూడకుండా సత్వరమే ఆధార్ కార్డుల జారీ
- 2019-20 ఆర్థిక సంవత్సరానికి నాలుగు కొత్త ఎంబసీల ఏర్పాటు
- దేశవ్యాప్తంగా 17 ఐకానిక్ టూరిజం ప్రాంతాల అభివృద్ధి
- మౌలిక రంగం అభివృద్ధి కోసం ‘ఐడియాస్ పథకం’ ప్రారంభం
- విద్యుత్ వాహనాల వినియోగం ప్రోత్సహానికి రూ.10,000 కోట్లు మంజూరు
- బ్యాంకింగ్ లో రూ.లక్ష కోట్ల మేర తగ్గిన నిరర్ధక ఆస్తులు(ఎన్ పీఏ)
- నాలుగేళ్లలో రూ.4 లక్షల కోట్ల ఎన్ పీఏలు వసూలు చేశాం
- ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల సాయం..బ్యాంకింగ్ రంగంలో ప్రక్షాళన
- ఎయిరిండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం
- మహాత్మాగాంధీపై సమగ్ర సమాచారం కోసం ‘గాంధీపీడియా’ను అక్టోబర్ 2న ఆవిష్కరిస్తాం
- మహిళా నాయకత్వంలో సాగే పరిశ్రమలను ప్రోత్సహిస్తాం
- దేశంలో పరిశోధన ప్రోత్సాహానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎన్ఆర్ఎఫ్) ఏర్పాటు
- త్వరలో రూ.1, 2, 5,10, 20 కొత్త నాణేల విడుదల.. వీటిని దివ్యాంగులు(అంధులు) కూడా గుర్తించేలా ముద్రణ