Ramcharan: అల్లూరి సీతారామరాజు జయంతి రోజున ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్వీట్

షార్ట్స్‌లో చూడండి
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో యవ్వనంలో ఉన్న సీతారామరాజు పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. బ్రిటీష్ వారిని గడగడలాడించిన సీతారామరాజు జయంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ మేరకు ట్వీట్ వెలువడింది. యవ్వనంలో ఉన్న రామరాజుగా రామ్ చరణ్ ను తెరపై చూపించేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. మహోన్నతుడైన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Ramcharan
Alluri
RRR

More Telugu News