Andhra Pradesh: ఏపీలో ఆగిన ఉచిత ఇసుక సరఫరా.. గుంటూరులో భారీగా రోడ్డెక్కిన కార్మికులు!

  • నాజ్ సెంటర్ లో ఆందోళన
  • ఇసుక విధానం తేవాలని డిమాండ్
  • ఉపాధి లేక అల్లాడుతున్నామని ఆవేదన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక సరఫరాను ఆపివేయడంతో తమకు ఉపాధి నిలిచిపోయిందని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కేంద్రంలోని నాజ్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఏపీ ప్రభుత్వం వీలైనంత త్వరగా నూతన ఇసుక సరఫరా విధానాన్ని తీసుకురావాలని కార్మికులు డిమాండ్ చేశారు.

తాము పనిచేస్తేనే ఇంట్లో పూట గడుస్తుందనీ, ఇప్పుడు ఉపాధి లేకపోవడంతో భార్యాపిల్లలు పస్తులు ఉండాల్సి వస్తోందని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లేకపోవడంతో జిల్లాలో 20-30 మందికి మించి పని దొరకడం లేదని తెలిపారు. గత మూడు నెలల నుంచి ఇసుక దొరకక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.

More Telugu News