అమర్‌నాథ్ యాత్రలో విషాదం.. కడప జిల్లా భక్తురాలి మృతి
- గుండెపోటుతో మృతి చెందిన భాగ్యమ్మ
- రేపు విమానంలో స్వస్థలానికి మృతదేహం
- యాత్ర సాఫీగా సాగుతోందన్న ఐటీబీపీ
మరోవైపు, అమర్‌నాథ్ యాత్రికుల్లో 15 మంది ఆక్సిజన్ అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడారు. అమర్‌నాథ్ యాత్ర సాఫీగా సాగుతున్నట్టు ఐటీబీపీ తెలిపింది. 46 రోజులపాటు సాగనున్న అమర్‌నాథ్ యాత్ర ఈ నెల 1న ప్రారంభమైంది. ఆగస్టు 15న శ్రావణ పూర్ణిమతో ముగుస్తుంది.