India: అప్పులు అన్నీ తీర్చేస్తా.. నన్ను వదిలేయండి బాబోయ్!: భారత్ కు విజయ్ మాల్యా విజ్ఞప్తి

  • సీబీఐ నాకు వ్యతిరేకంగా క్షుద్రకుట్ర చేస్తోంది
  • కోర్టు నాకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది
  • సీబీఐ నాపై నమోదుచేసిన అభియోగాలన్నీ తప్పు

ప్రభుత్వ రంగ బ్యాంకులకు సుమారు రూ.9,000 కోట్ల కుచ్చుటోపి పెట్టి బ్రిటన్ కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దిగివచ్చారు. తాను తీసుకున్న మొత్తం రుణాలను తిరిగి చెల్లిస్తాననీ, తనను వదిలిపెట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. సీబీఐ తనకు వ్యతిరేకంగా క్షుద్ర కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, భారత్ కు తనను అప్పగించే విషయమై అప్పీల్ చేసుకునేందుకు బ్రిటన్ కోర్టు మాల్యాకు అనుమతి ఇచ్చింది. ఈ విషయమై మాల్యా స్పందిస్తూ..‘దేవుడు గొప్పవాడు. న్యాయం ఇంకా మిగిలే ఉంది. సీబీఐ నాపై మోపిన ప్రాథమిక అభియోగాలపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ఇంగ్లాండ్ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అప్పీల్‌కు అవకాశమిచ్చింది. సీబీఐ అభియోగాలు తప్పు అని నేను చెబూతూనే ఉన్నా’ అని ట్వీట్ చేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులు, ఇతర రుణదాతలకు కూడా అప్పులను తిరిగి చెల్లించేస్తానని మాల్యా ఆఫర్ ఇచ్చారు.

More Telugu News