isro: చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించిన ఇస్రో.. ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్

  • ఈ నెల 12 తెల్లవారుజామున చంద్రయాన్-2 ప్రయోగం
  • 10 వేల మందికి ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం
  • ఆన్ లైన్ లోనే అనుమతి ఇవ్వనున్న ఇస్రో

శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికెగసే రాకెట్లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మనం ఎన్నో సార్లు వీక్షించాం. అయితే, షార్ కు వెళ్లి ప్రత్యక్షంగా ఈ ప్రయోగాలను వీక్షించాలనే కోరిక మనలో దాదాపు అందరికీ ఉంటుంది. మన కోరికను నెరవేర్చే దిశగా ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-2 ప్రయోగాన్ని చూసే అవకాశాన్ని కల్పించింది.

ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున 2.51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు 10 వేల మంది ప్రజలకు ఇస్రో అవకాశం కల్పించింది. రేపు (4వ తేదీ) అర్ధరాత్రి (00.00 గంటలు) నుంచి ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు ఇస్రో వెబ్ సైట్ www.isro.gov.in లో వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఆన్ లైన్ లోనే అనుమతి ఇవ్వనున్నట్టు ఇస్రో ప్రకటించింది.

More Telugu News