Pakistan: ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు ఓటమిపై పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ఏడుపు!

  • ఇంగ్లండ్‌పై కోహ్లీసేన కావాలనే ఓడిందనేలా వకార్ ట్వీట్
  • క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ అక్కసు
  • ఇంగ్లండ్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్న వకార్

ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసిందంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. పాక్ సెమీస్ ఆశలపై నీళ్లు కుమ్మరించాలనే ఉద్దేశంతోనే భారత్ ఆడినట్టు కనిపించిందని ధ్వజమెత్తాడు. ఇంగ్లండ్-భారత్ మ్యాచ్ పాక్‌కు జీవన్మరణ సమస్యలా మారిన నేపథ్యంలో ఇంగ్లండ్ గెలుపును వకార్ జీర్ణించుకోలేకపోయాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే పాక్‌కు సెమీస్ అవకాశాలు పుష్కలంగా ఉండేవి. అందుకే, కోహ్లీ సేన గెలవాలంటూ పాక్ అభిమానులు ప్రార్థనలు చేశారు. అయితే, భారత జట్టు పరాజయంతో వారి ఆశలు అడుగంటాయి. ఈ నేపథ్యంలో వకార్ యూనిస్ ట్వీట్ ద్వారా భారత్‌పై తనకున్న అక్కసును బయటపెట్టాడు.

పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్తుందా? లేదా? అన్నదానిపై తనకు పెద్దగా పట్టింపు లేదని, కానీ కొందరు చాంపియన్ల క్రీడాస్ఫూర్తి దారుణంగా ఉందంటూ పరోక్షంగా భారత ఆటగాళ్లపై విమర్శలు గుప్పించాడు. కాగా, ఇటీవల పాక్ నిషేధిత ఆటగాడు బసిత్ అలీ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. పాక్‌ సెమీస్‌కు చేరకుండా భారత జట్టు కుట్ర చేస్తోందని ఆరోపించాడు.  

More Telugu News