Swami Chakrapani: జైరా నిర్ణయం భేష్... హిందూ నటీమణులు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి: స్వామి చక్రపాణి

  • సినీ రంగం నుంచి తప్పుకున్న దంగల్ నటి
  • దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు
  • స్పందించిన చక్రపాణి
సినిమాల కారణంగా తాను దేవుడికి దూరమవుతున్నానంటూ అనూహ్యరీతిలో చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పిన దంగల్ నటి జైరా వాసిమ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. జైరా నిర్ణయం పట్ల మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి కూడా స్పందించారు. సినిమాల నుంచి తప్పుకోవాలని నటి జైరా వాసిమ్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అన్నారు. చిత్రరంగంలో ఉన్న హిందూ నటీమణులు జైరా తీసుకున్న నిర్ణయం పట్ల ఆలోచించాలని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని స్వామి చక్రపాణి పిలుపునిచ్చారు.
Swami Chakrapani
Dangal
Zaira Wasim

More Telugu News