Mallu Bhatti Vikramarka: తుగ్లక్ చర్యలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు: మల్లు భట్టి విక్రమార్క

  • అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలతో ప్రజాధనం దుర్వినియోగం
  • కూల్చివేతలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.
  • పాలనపై కేసీఆర్ దృష్టి సారించాలి
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది తుగ్లక్ చర్య అని... భవనాల కూల్చివేతను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. అన్ని సదుపాయాలు ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని సూచించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ ల నిర్మాణం కేసీఆర్ కుటుంబ వ్యవహారం కాదని అన్నారు. పాలనపై కేసీఆర్ దృష్టి సారించాలని చెప్పారు.
Mallu Bhatti Vikramarka
kct
TRS
congress

More Telugu News