Road Accident: సిమ్లాలో రోడ్డు ప్రమాదం : లోయలో పడిన స్కూల్‌ బస్సు

  • ఘాట్‌ రోడ్డులో ప్రమాదం
  • డ్రైవర్‌తోపాటు ఇద్దరు విద్యార్థుల మృతి
  • సహాయక చర్య చేపట్టిన స్థానికులు
సిమ్లాలోని ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన స్కూల్‌ బస్సు లోయలోకి దూసుకు పోయిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విద్యార్థులతో వెళ్తున్న బస్సు లోయలోకి దూసుకుపోయి కొంతదూరంలో నిలిచిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తోపాటు ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మిగిలిన విద్యార్థుల్లో కొందరికి తీవ్రగాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాసేపటికి వారు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
Road Accident
simla
school bus
three died

More Telugu News