Engeneering: మరోసారి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా

  • ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో రాని స్పష్టత
  • జులై 5కు వాయిదా పడిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
  • కొనసాగుతున్న ధ్రువ పత్రాల పరిశీలన

తెలంగాణలో రేపు ప్రారంభం కావల్సిన ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో స్పష్టత రాకపోవడంతో వాయిదా వేశారు. జులై 5 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టనున్నట్టు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇంజినీరింగ్ ఫీజులను తాత్కాలికంగా 15 - 20 శాతం పెంచాలని టీఏఎఫ్ఆర్‌సీ నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇంజినీరింగ్ అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన జులై 3 వరకూ కొనసాగనుంది.

More Telugu News