ఆసక్తిని రేపుతోన్న 'రణరంగం' టీజర్
- మాఫియా డాన్ గా శర్వానంద్
- నాయికలుగా కాజల్ - కల్యాణి ప్రియదర్శన్
- ఆగస్టు 2వ తేదీన విడుదల
మాఫియా డాన్ లుక్ తోను .. మాస్ లుక్ తోను ఈ టీజర్లో శర్వానంద్ కనిపిస్తున్నాడు. ఇటు కాజల్ తోను .. అటు కల్యాణి ప్రియదర్శన్ తోను ఆయన జట్టు కట్టిన షాట్స్ ను చూపించారు. 1990 నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా నిర్మితమైంది. ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే ఆశాభావంతో శర్వానంద్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.