తెలంగాణ యాసలో చైతూ డైలాగ్స్

29-06-2019 Sat 16:06
  • కొత్త ప్రాజెక్టుతో బిజీగా శేఖర్ కమ్ముల
  •  చైతూ కెరియర్లో 20వ సినిమా 
  • సహజత్వానికి దగ్గరగా నడిచే కథ     
శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా వున్నారు. త్వరలోనే ఆయన ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కథానాయకుడిగా .. సాయిపల్లవి నాయికగా నటించనున్నారు. శేఖర్ కమ్ముల 'ఫిదా' తరువాత సాయిపల్లవితో చేస్తున్న సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి నెలకొంది.

శేఖర్ కమ్ముల 'ఫిదా'లో సాయిపల్లవి పాత్రతో తెలంగాణ యాస మాట్లాడించి, ఆమె క్రేజ్ పెరిగేలా చేశారు. ఇప్పుడు ఈ కొత్త సినిమాలో చైతూ పాత్రతో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పించనున్నట్టు తెలుస్తోంది. చైతూ వీలును బట్టి తెలంగాణ యాసలో ఆయనకి శిక్షణ ఇప్పిస్తున్నాడట. ఈ పాత్ర పట్ల చైతూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వున్నాడని అంటున్నారు. కెరియర్ పరంగా ఆయనకి ఇది 20వ సినిమా. శేఖర్ కమ్ముల స్టైల్లోనే ఈ కథ సహజత్వానికి దగ్గరగా నడుస్తుందని అంటున్నారు.