Telangana: బీజేపీ రాజకీయ వ్యాపారంలోకి దిగలేదు: మురళీధర్ రావు

  • రాజకీయాలను వ్యాపారంగా బీజేపీ ఆలోచించదు
  • టీడీపీలో అంతర్మథనం ప్రారంభమైంది
  • బీజేపీలోకి ఇతర పార్టీల నాయకులు రావడం వల్ల మా సిద్ధాంతాలేమీ మారవు

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునే యత్నాలు జోరుగా సాగుతున్నాయన్న వదంతులపై భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ రాజకీయ వ్యాపారంలోకి దిగలేదని, రాజకీయాలను వ్యాపారంగా ఆలోచించదని స్పష్టం చేశారు. టీడీపీలో అంతర్మథనం ప్రారంభమైందని, మోదీ నాయకత్వంలో బీజేపీకి భవిష్యత్ బాగుందని, దక్షిణాదిలో కూడా తమ పార్టీ నిలదొక్కుకుంటుందన్న ఉద్దేశంతోనే ఆ పార్టీ నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు.

బీజేపీలోకి ఇతర పార్టీల నాయకులు రావడం వల్ల తమ పార్టీ మలినం అయిపోయిందని, ఏదో మార్పు వచ్చిందనడం కరెక్టు కాదని అన్నారు. ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరడం ద్వారా బీజేపీ సిద్ధాంతాలేమీ మారవని, ‘బీజేపీ డీఎన్ఏ’ ను మార్చిన ఘటనలు లేవని అన్నారు. బీజేపీ బలోపేతం చేస్తారే తప్ప, పార్టీ దిశను మారుస్తారన్న అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు.

More Telugu News