ukraine: ఉక్రెయిన్ లో ఆందోళనకు దిగిన భారత విద్యార్థులు

  • మెడికల్ వర్సిటీలపై నిరసన
  • శాపంగా పరిణమించిన ఐ-ఫామ్ నిబంధన
  • ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం ముందు ఆందోళన
వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ కు వెళ్లిన భారత విద్యార్థులు అక్కడ నానా కష్టాలు పడుతున్నారు. బొగమలెట్స్, కీవ్ మెడికల్ వర్సిటీలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఐ-ఫామ్ పేరిట ఇటీవల కొత్త నిబంధనలు వచ్చాయి. ఈ నిబంధనలు మన విద్యార్థులకు శాపంగా పరిణమించాయి. ఇక్కడ చదువుతున్నవారిని ఇంటికి పంపేందుకే ఈ నిబంధనలు తెచ్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తడంతో... ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం ఎదుట భారతీయ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మరోవైపు, విద్యార్థుల పాట్లపై కన్సల్టెన్సీలు స్పందించడం లేదు.  
ukraine
medical students
india
protest

More Telugu News