Krishna: కృష్ణ గారిని ఎలా బయటకు తేవాలో అర్థం కావడంలేదు: అల్లుడు గల్లా జయదేవ్

  • కృష్ణ గారికి తీరని లోటు
  • బాధను ఎలా తొలగించాలో
  • విజయనిర్మల డేరింగ్ మహిళ
  • మీడియాతో గల్లా జయదేవ్
50 సంవత్సరాల పాటు సహచరిగా ఉండి, కష్ట సుఖాల్లో తోడున్న విజయనిర్మల మరణం అందరికన్నా కృష్ణ గారికి తీరని లోటని, ఆయనలోని బాధను తొలగించి, తిరిగి మామూలు మనిషిని చేయడం ఎలాగో తమకు తెలియడం లేదని ఆయన అల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.

మోయినాబాద్ సమీపంలోని విజయకృష్ణ ఫామ్ హౌస్ వద్ద అంత్యక్రియల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న గల్లా జయదేవ్, మీడియాతో మాట్లాడుతూ, 1992లో తన వివాహమైన తరువాత, విజయనిర్మల గారి గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నానని అన్నారు. ఆమె మృతి వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. కృష్ణ, విజయనిర్మల కలిసి కష్టాలను, సుఖాలను పంచుకున్నారని, ఆమె ఓ డేరింగ్ మహిళని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిబ్బరంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.
Krishna
Galla Jayadev
Vijayanirmala

More Telugu News