VVS Lakshman: ధోనీ చింతించే రోజు వస్తుంది: వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్య!

  • నిన్నటి మ్యాచ్ లో నిదానంగా ఆడిన ధోనీ
  • మొదటి నుంచి ధాటిగా ఆడాల్సిందన్న లక్ష్మణ్
  • భవిష్యత్ లో వెనుదిరిగి చూసుకుని చింతించక తప్పదని వ్యాఖ్య

ఈ వరల్డ్ కప్ క్రికెట్ పోరులో ధోనీ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, స్టయిలిష్ బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్న వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశించినంత వేగంగా ధోనీ పరుగులు చేయలేదని, అతని స్ట్రయిక్ రేట్ ఎంతో సేపు 50 దాటలేదని గుర్తు చేస్తూ, ఇది తనకు ఎంతో అసంతృప్తిని కలిగించిందని అన్నారు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ధోనీ వెనక్కు తిరిగి చూసుకుంటే, ఇదే విధమైన అభిప్రాయం కలుగుతుందని, తన ఆటతీరుతో ఆయన చింతిస్తాడని అభిప్రాయపడ్డారు.

నిన్నటి మ్యాచ్ లో 29వ ఓవర్ లో కేదార్ జాదవ్ అవుట్ అయిన తరువాత క్రీజ్ లోకి వచ్చిన ధోనీ, వేగంగా ఆడలేదన్న సంగతి తెలిసిందే. చివరి వరకూ ఉన్న ధోనీ, ఆఖర్లో బ్యాట్ ను ఝళిపించి 56 పరుగులు చేశాడు. అంతకుముందు చాలాసేపు సింగిల్స్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది కాబట్టి, ధోనీ తప్పించుకున్నాడని మాజీలు అభిప్రాయపడ్డారు. ధోనీ హాఫ్ సెంచరీ చేయడం కలిసొచ్చిన అంశమే అయినా, క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి అదే విధంగా ఆడివుంటే బాగుండేదని, పాండ్య ఆరంభం నుంచే సానుకూల దృక్పథంతో ఆడాడని, ధోనీ అలా ఆడలేదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

More Telugu News