కళ్లెంలేని గుర్రంతో జూనియర్ ఎన్టీఆర్ కవ్వింపులు ... వీడియో వైరల్

27-06-2019 Thu 20:26
  • సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన స్పందన
  • ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్
  • తిరుపతిలో గుర్రపుస్వారీ నేర్చుకుంటున్న జూనియర్!
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర కథాంశం బ్రిటీష్ పాలన నాటిది కావడంతో గుర్రాలకు కూడా చిత్రీకరణలో చోటు కల్పించినట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఓ గుర్రంతో ఆటలు ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సివిల్ డ్రెస్ లో ఉన్న ఎన్టీఆర్ కళ్లెంలేని ఆ గుర్రాన్ని కవ్విస్తూ వెనక్కి గెంతుతుండగా,  ఆ గుర్రం ఎన్టీఆర్ దిశగా వచ్చి ఒక్కసారిగా ముందుకాళ్లు గాల్లోకి లేపడం ఆ వీడియోలో చూడొచ్చు. కాగా, రాజమౌళి చిత్రం కోసం తారక్ తిరుపతిలో హార్స్ రైడింగ్ లో శిక్షణ పొందుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో కూడా తిరుపతిలో చిత్రీకరించినదై ఉంటుందని భావిస్తున్నారు.