Krishna: విజయనిర్మల భౌతికకాయం వద్ద కేసీఆర్ ను పట్టుకుని చిన్నపిల్లాడిలా విలపించిన కృష్ణ

  • కృష్ణ నివాసంలో విజయనిర్మల భౌతికకాయం
  • నివాళులు అర్పించిన కేసీఆర్
  • కృష్ణను దగ్గరకు తీసుకుని ఓదార్చిన తెలంగాణ సీఎం

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఈ సాయంత్రం కృష్ణ నివాసంలో విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను చూడగానే కృష్ణలో దుఃఖం కట్టలు తెంచుకుంది. కేసీఆర్ ను పట్టుకుని చిన్నపిల్లాడిలా విలపించారు. కృష్ణ అంతటి వ్యక్తిని ఆ స్థితిలో చూడాల్సి రావడం పట్ల కేసీఆర్ కూడా కదిలిపోయారు. ఆయన సైతం తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. బోరున విలపిస్తున్న కృష్ణను దగ్గరకు తీసుకుని సముదాయించారు.
  

More Telugu News