Kesineni Nani: తాజ్ మహల్ యమునా తీరాన ఉండబట్టి సరిపోయింది!: కేశినేని నాని వ్యంగ్యాస్త్రం!

  • ఫేస్ బుక్ లో పోస్ట్
  • కృష్ణా తీరాన ఉంటే తాజ్ మహల్ నూ కూల్చేవారేమో
  • విజయవాడ ఎంపీ కేశినేని నాని
కృష్ణానది తీరాన ఉన్న ప్రజావేదిక కూల్చివేతపై విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. "ఇంకా నయం... తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా లోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే..." అని ఆయన అన్నారు. కాగా, కరకట్టపై అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ, ప్రజావేదిక భవనాన్ని ఏపీ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. నిన్నటివరకూ 70 శాతం కూల్చివేత పూర్తికాగా, నేడు మిగతా భాగాన్ని అధికారులు తొలగించనున్నారు.
Kesineni Nani
Vijayawada
Tajmahal

More Telugu News