Pawan Kalyan: తెలంగాణ వారికున్న పట్టుదల ఆంధ్రుల్లో లేదు: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

  • తెలంగాణ ప్రజల్లో బలమైన ఆకాంక్ష
  • అందువల్లే దశాబ్దాల పోరాటానికి ఫలితం
  • చంద్రబాబు మాట మార్చినా ప్రజల నుంచి నిరసన రాలేదు
  • జనసేన అధినేత పవన్ కల్యాణ్
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునే విషయంలో తెలంగాణ ప్రజలకు ఉన్న బలమైన ఆకాంక్షను, ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రావాసులు చూపించలేకపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణవాసుల్లోని పట్టుదల ఏపీ ప్రజల్లో లేకపోయిందని ఆన్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ కోసం పోరాటం జరిగిందని, హోదా విషయంలో మాత్రం అలా జరగలేదని గుర్తు చేశారు. హోదాపై చంద్రబాబునాయుడు పలుమార్లు మాట మార్చినా ప్రజల నుండి సరైన నిరసన రాలేదని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి నిరసన రానందునే, తామేమీ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. హోదా సాధన విషయంలో ప్రజలకు, పాలకులకు బలమైన ఆకాంక్ష ఉండాలని సూచించారు.
Pawan Kalyan
Telangana
Andhra Pradesh

More Telugu News