100 కోట్ల క్లబ్ లోకి చేరిన 'కబీర్ సింగ్'
- ఈ నెల 21న థియేటర్లకు వచ్చిన 'కబీర్ సింగ్'
- 3,123 థియేటర్లలో విడుదల
- అయిదు రోజుల్లో 100 కోట్ల వసూళ్లు
తొలి రోజునే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, అయిదు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. షాహిద్ కపూర్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది నిలిచిందని చెబుతున్నారు. 3,123 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, ఈ ఏడాదిలో ఇంతవరకూ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో 4వ స్థానంలో నిలిచిందని అంటున్నారు. సందీప్ వంగాతో మరో సినిమా చేసే ఆలోచలో షాహిద్ కపూర్ ఉన్నాడనేది బాలీవుడ్ టాక్.