బాలీవుడ్ కి వెళుతోన్న 'జెర్సీ' కథ

Tue, Jun 25, 2019, 02:10 PM
  • నానికి హిట్ ఇచ్చిన 'జెర్సీ'
  • కరణ్ జొహార్ చేతికి రీమేక్ హక్కులు
  •  నాని పాత్రలో షాహిద్ కపూర్?
నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'జెర్సీ' ప్రశంసలు అందుకుంది. నాని కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ .. మనసును తాకే ఎమోషన్స్ ను తనలో కలుపుకున్న కథ. అందువలన ఈ సినిమా హిందీ ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని భావించిన కరణ్ జొహార్, రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే హిందీలోనూ దర్శకత్వం చేయమన్నట్టుగా సమాచారం. నాని పాత్రలో షాహిద్ కపూర్ ను ఎంపిక చేయనున్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha