దేశంలోని సినిమా వాళ్లలో అత్యంత ధనికుడు శోభన్ బాబు: మురళీమోహన్

24-06-2019 Mon 17:54
  • శోభన్ బాబుగారికి ముందుచూపు ఎక్కువ 
  • స్థలాల కొనుగోలుపై ఆయన ఎక్కువ దృష్టిపెట్టారు
  • తనను ఆ దిశగా నడిపించింది ఆయనేనన్న మురళీమోహన్

తాజా ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ, తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు. వ్యాపార వ్యవహారాల్లో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నదీ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి దిగానంటూ శోభన్ బాబు గురించి ఇలా చెప్పుకొచ్చారు.

"శోభన్ బాబుగారితో నాకు మంచి సాన్నిహిత్యం వుంది. ఆయనకి చాలా ముందుచూపు ఎక్కువ. డబ్బు విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వుండేవారు. తన చేతికి వచ్చిన ప్రతి రూపాయిని స్థలాలపై పెట్టారు. తనకి ఎక్కడ నచ్చితే అక్కడ స్థలాలు కొనేశారు. ఆ రోజుల్లో ఆయన ఎకరం 5 వేలకి కొంటే ఆ తరువాత ఎకరం 50 కోట్లకి పెరిగింది. అలా ఆయన చెన్నై పరిసర ప్రాంతాల్లో ఎన్నేసి స్థలాలు కొన్నారో లెక్కేలేదు. ఒక విధంగా చెప్పాలంటే, భారత దేశంలోని సినిమా ఆర్టిస్టులందరిలోకి అత్యంత ధనికుడు ఎవరంటే శోభన్ బాబేనని చెప్పాలి" అన్నారు.