బజాజ్ చేతక్ స్కూటర్ పై సోనూసూద్ చక్కర్లు.. తండ్రిని గుర్తుచేసుకున్న నటుడు!

24-06-2019 Mon 10:51
  • మా నాన్న కొన్న స్కూటర్ ఇది
  • ఆయనకు కొత్త కారు, బైక్ కొనిచ్చా
  • అయినా ఇదే ఆయనకు ఫేవరెట్ గా నిలిచింది
ప్రముఖ నటుడు సోనూసూద్ తన తండ్రి శక్తి సూద్ ను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇంట్లో తన తండ్రికి చెందిన పాత బజాబ్ చేతక్ స్కూటర్ పై సోనూ ఈరోజు చక్కర్లు కొట్టారు. అనంతరం ఈ విషయమై స్పందిస్తూ..‘ఇది నాన్న స్కూటర్. ఈ స్కూటర్ నాకు చాలా స్పెషల్. సినిమాల్లోకి వచ్చాక నాన్నకు కొత్త కారు, కొత్త బైక్ కొనిచ్చాను. కానీ ఈ స్కూటర్ మాత్రమే ఆయన ఫేవరెట్ గా నిలిచింది.

ఇక ఇది ఎప్పటికీ  నా ఫేవరెట్ గా ఉండిపోతుంది. ఈ స్కూటర్ పై ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రైడ్ చేస్తా. ఈ స్కూటర్ ఇంజిన్ సౌండ్ మిశ్రమమైన అనుభూతి కలుగుతోంది. మిస్ యూ డాడ్’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా స్కూటర్ నడిపిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధడిపన శక్తిసూద్ 2017, ఫిబ్రవరి 7న తుదిశ్వాస విడిచారు.