Andhra Pradesh: అన్నా.. ఇకపై నాకు శాలువాలు, బొకేలు తీసుకురావద్దు.. ఆ ఒక్క పని చేయండి!: మంత్రి అనిల్ కుమార్

  • బొకేలకు బదులుగా స్టేషనరీ వస్తువులు తీసుకోండి
  • అవి స్కూలు పిల్లలకు చేరేలా చూడండి
  • ట్విట్టర్ లో కోరిన ఏపీ జలవనరుల మంత్రి

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన అభిమానులు, వైసీపీ కార్యకర్తలకు ఓ చిరు విజ్ఞప్తి చేశారు. తనను కలవడానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలాదూరం నుంచి వస్తున్నారనీ, వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఇలా వస్తున్నవారంతా శాలువాలు, బొకేలకు బదులుగా పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తీసుకురావాలని కోరారు. ఈ వస్తువులు స్కూలు పిల్లలకు చేరేలా చూడాలని సూచించారు. ఇలా చేస్తే తాను చాలా సంతోషిస్తానని పేర్కొన్నారు.

ఈరోజు ట్విట్టర్ లో మంత్రి అనిల్ స్పందిస్తూ..‘నన్ను కలవడానికి ఎంతో దూరం నుండి వస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అన్న. కాకపోతే ఇక నుండి మీరు శాలువా, బోకేలకు బదులుగా, ఏమన్నా పుస్తకాలు, పెన్, పెన్సిల్, అలా పిల్లలకు ఉపయోగ పడే స్టేషనరీ వస్తువులు వాళ్ళకి చేరేదట్టు చూడండి అన్న. నాకు చాలా ఆనందం కలిగిస్తుంది’ అని ట్వీట్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ తరహాలోనే పార్టీ శ్రేణులకు గతంలో సూచించిన సంగతి తెలిసిందే.

More Telugu News