ఖుష్బూ ఇంటి దగ్గరలో 10 రోజులుగా నిలిచిన లారీ... ఎవరిదో తేల్చేందుకు రంగంలోకి పోలీసులు!
- చెన్నై, శాంతోమ్ లో ఖుష్బూ ఇల్లు
- లారీ ఫొటోను ట్విట్టర్ లో పెట్టిన కుష్బూ
- ప్రజలు పట్టించుకోలేదన్న కుష్బూ
- మీరెందుకు ఫిర్యాదు చేయలేదని నెటిజన్లు చివాట్లు
ఇక ఖుష్బూ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీరెందుకు పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని పలువురు ప్రశ్నించారు. ఇంకొందరు హేళనగా మాట్లాడారు. దీనిపై ఖుష్బూ సమాధానమిస్తూ, లారీ తన వీధిలో లేదని, అదే జరిగుంటే, తానే ఫిర్యాదు చేసేదాన్నని అన్నారు. తనను నిందించడం సరికాదని కోరారు. ఇక ఈ రాద్ధాంతం గురించి తెలుసుకున్న పోలీసులు, కంటెయినర్ ఉన్న ప్రాంత వివరాలను ఖుష్బూను అడిగి తెలుసుకున్నారు. కంటెయినర్ సంగతి తేలుస్తామన్నారు.