Vijayawada: ‘అతిథి దేవోభవ’ పేరుతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం: ఏపీ మంత్రి అవంతి

  • ఏపీలో పర్యాటక వనరులు ఉన్నాయి
  • విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు 
  • భవానీ ద్వీపాన్ని బృందావనంగా తీర్చిదిద్దుతాం

‘అతిథి దేవోభవ’ పేరుతో ఏపీలో పర్యాటకాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,  చాలా దేశాల్లో ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమేనని అన్నారు. సముద్రం, నదులు, అడవులు వంటి పర్యాటక వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడలోని భవానీ ద్వీపం అనుకున్న రీతిలో అభివృద్ధి చెందలేదని, ఈ ద్వీపాన్ని అందమైన బృందావనంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విజయవాడ వచ్చే పర్యాటకులంతా భవానీ ద్వీపాన్ని సందర్శించేలా అభివృద్ధి చేస్తామని, ఏపీలోని పర్యాటక ప్రాంతాలపై విస్తృత ప్రచారం చేయిస్తామని, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను పెంచుతామని స్పష్టం చేశారు. అక్షర క్రమంలో ముందుండే అమరావతి.. పర్యాటకంలోనూ ముందుండాలని అవంతి ఆకాంక్షించారు. 

More Telugu News