Andhra Pradesh: ఒంగోలులో గ్యాంగ్‌రేప్.. ఆరుగురు యువకులు పది రోజులపాటు బాలికపై అఘాయిత్యం!

  • యువకుడి పిలుపుతో గుంటూరు నుంచి ఒంగోలుకు బాలిక
  • ఒంగోలు బస్టాండులో కామాంధులకు చిక్కిన బాధితురాలు
  • నిందితుల్లో నలుగురు ఇంజినీరింగ్ యువకులు, ఓ దివ్యాంగుడు

పదో తరగతి చదువుకుంటున్న బాలిక ఓ యువకుడిని నమ్మి అతడిని వెతుక్కుంటూ వెళ్లి కామాంధుల చేతికి చిక్కింది. ఆమెను బంధించిన ఆరుగురు యువకులు పది రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం ఆమె వారి చెర నుంచి తప్పించుకుని బయటపడడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారిలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండడం గమనార్హం. ఒంగోలులో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం..  గుంటూరుకు చెందిన బాధిత బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్‌తో ఏర్పడిన స్నేహం ప్రేమకు దారితీసింది. ఓసారి ఒంగోలు రావాలన్న ప్రేమికుడి పిలుపు మేరకు పది రోజుల క్రితం ఆమె ఒంగోలు వెళ్లింది. రాత్రి బస్సు దిగి అతడి కోసం ఎదురుచూస్తున్న సమయంలో అతడికి ఫోన్ చేయాలనుకుంది. అయితే, ఆమె వద్ద ఫోన్ లేకపోవడంతో బస్టాండ్‌లో ఉన్న ఓ వ్యక్తిని మొబైల్ అడిగి ఫోన్ చేసింది. అయితే, ఆ ఫోన్‌కాల్‌కు ప్రియుడు స్పందించలేదు.  

ఆమెనే గమనిస్తున్న బస్టాండులో పనిచేసే ఓ దివ్యాంగ యువకుడు బాలిక ఎదురుచూస్తున్న వ్యక్తి తనకు తెలుసని, తీసుకెళ్తానని నమ్మబలికాడు. సమీపంలోనే ఉండే ఓ గదికి తీసుకెళ్లాడు. ఈ లోపు తన స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించాడు. ఇద్దరూ కలిసి ఆ రాత్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను మరో గదికి తీసుకెళ్లారు. అందులో ఉండే నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఎదురు తిరిగితే చిత్రహింసలు పెట్టేవారు. అంతేకాదు, ఆమెకు తిండిపెట్టకుండా, దుస్తులు ఇవ్వకుండా వేధించారు.  

కామాంధుల చెర నుంచి  శనివారం సాయంత్రం ఎలాగోలా తప్పించుకున్న బాలిక బస్టాండుకు చేరుకుని ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడుస్తుండగా గమనించిన అవుట్‌పోస్టు కానిస్టేబుల్ వెళ్లి ఆరా తీస్తే ఈ దారుణం బయటపడింది. వెంటనే బాలికను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆమె ఫిర్యాదు చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక ఇచ్చిన సమాచారంతో అసలు నిందితుడైన దివ్యాంగ యువకుడిని తొలుత అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిచ్చిన సమాచారంతో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.  

More Telugu News