Andhra Pradesh: దేశంలో ఉండిఉంటే విజయ్ మాల్యాకు కూడా బీజేపీ నేతలు కండువా కప్పేవారు!: కళా వెంకట్రావు సెటైర్లు

  • నలుగురు ఎంపీలను నిబంధనలకు విరుద్ధంగా చేర్చుకున్నారు
  • ఈ అప్రజాస్వామిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారు
  • అమరావతిలో మీడియాతో ఏపీ టీడీపీ చీఫ్
టీడీపీ రాజ్యసభ సభ్యులైన సుజానా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ లను నిబంధనలకు విరుద్ధంగా బీజేపీలో చేర్చుకున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. విజయ్ మాల్యా దేశంలో ఉంటే ఆయన్ను కూడా బీజేపీలో చేర్చుకునేవారని ఎద్దేవా చేశారు. బీజేపీ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

గుంటూరులోని ఉండవల్లిలో ఈరోజు కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ప్రజావేదికను కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా లేఖ రాసినప్పటికీ ఏపీ ప్రభుత్వం స్పందించలేదని ఆయన విమర్శించారు. ఈ విషయంలో కనీస సమాచారం ఇవ్వకుండా సామగ్రిని ఖాళీ చేయడాన్ని నిరసిస్తున్నామని చెప్పారు.
Andhra Pradesh
Telugudesam
kala
venkatrao
BJP
4 mps join
Jagan
Chandrababu

More Telugu News