YV Subba Reddy: శ్రీవారి ఆభరణాలపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేలుస్తాం: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • తొలి ప్రాధాన్యం సామాన్య భక్తులే
  • తిరుమలలో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం
  • టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వైవీ
వైసీపీ అగ్రనేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డు చైర్మన్ గా ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీడీ తొలి ప్రాధాన్యత సామాన్య భక్తులేనని స్పష్టం చేశారు. తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామని అన్నారు. శ్రీవారి ఆభరణాల విషయంలో వచ్చిన ఆరోపణలన్నింటిపైనా విచారణ జరిపిస్తామని, నిజానిజాలు వెలికితీస్తామని చెప్పారు. అంతేకాకుండా, అర్చకుల సమస్యలపై పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే మఠాధిపతులు, పీఠాధిపతులతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.
YV Subba Reddy
TTD
YSRCP
Tirumala

More Telugu News