Undavalli: ప్రజావేదికను ఖాళీ చేయిస్తున్న అధికారులు.. చంద్రబాబు సామగ్రిని బయటపడేసిన సిబ్బంది

  • మండిపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు
  • సమాచారం లేకుండా ఎలా చేస్తారంటూ ఆగ్రహం
  • వేదికను తనకు కేటాయించాలని కోరిన బాబు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఉండవల్లి సమీపాన కృష్ణా కరకట్టను ఆనుకుని ఉన్న ప్రజావేదికపై అధికార, తెలుగుదేశం పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. తాజాగా అధికారులు ప్రజావేదికను ఖాళీ చేయిస్తుండడం, చంద్రబాబు వ్యక్తిగత సామాన్లను సిబ్బంది బయట పడేయడంపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు నివాస ప్రాంగణం పక్కనే ఉన్న ఈ ప్రజా వేదికను ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వాడుకునేందుకు తనకు కేటాయించాలంటూ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. అయితే చాలా రోజులైనా ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిన్న సాధారణ పరిపాలన శాఖ అధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ప్రజావేదిక భవనాన్ని పరిశీలించి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

కనీస సమాచారం లేకుండా, తమ నాయకుడి లేఖకు జవాబివ్వకుండా ఇదేం విధానమని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా వేదికను ఖాళీ చేయిస్తుండడం, చంద్రబాబు సామాన్లు బయటపడేస్తుండడంతో మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News