Crime News: ఆ పాము ఖరీదు రూ.1.6 కోట్లు!

  • మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో సంచరించే పాము
  • ప్రస్తుతం పోలీసుల స్వాధీనంలో ఆరుదైన సర్పరాజం
  • చైనాకు స్మగ్లింగ్‌ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు

అదో అరుదైన సర్పరాజం. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ కోట్లలోనే. అందుకే స్మగ్లర్ల దృష్టిపడింది. మహారాష్ట్రలో లభించే ఈ సర్పరాజాన్ని పట్టుకుని విదేశాలకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...జార్ఖండ్‌ రాష్ట్రంలోని బొకారో నగరంలో సునీల్‌ పాశ్వాన్‌, మహ్మద్‌ షహబుద్దీన్‌ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించారు.

దీంతో, వారి వద్ద  కోట్ల రూపాయల విలువ చేసే అరుదైన సర్పరాజం లభించడంతో అవాక్కయ్యారు. దాన్ని స్వాధీనం చేసుకుని వారిని ప్రశ్నించగా మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో సంచరించే ఈ అరుదైన సర్పరాజాన్ని చైనాకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అటవీ శాఖాధికారి సురేంద్ర భగత్‌ మాట్లాడుతూ ఈ పాముకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందని, ముఖ్యంగా చైనాలో మంచి మార్కెట్‌ ఉందని తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లింగ్‌ ముఠా ఈ పామును నేపాల్‌ దేశం మీదుగా చైనాకు తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిందని తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామని తెలిపారు.

More Telugu News