Iran: ఇరాన్ పై దాడులకు ట్రంప్ ఆదేశాలు... యుద్ధ విమానాలు బయలుదేరుతుంటే ఆదేశాలు వెనక్కి!

  • యూఎస్ డ్రోన్ ను కూల్చేసిన ఇరాన్
  • ఇరాన్ స్థావరాలను నాశనం చేయాలని ఆదేశం
  • ఆపై మనసు మార్చుకున్న ట్రంప్

తమ నిఘా విమానాన్ని కూల్చివేశారన్న ఆగ్రహంతో ఉన్న ట్రంప్, ఇరాన్ పై మిలిటరీ దాడులకు ఆదేశాలు ఇచ్చి, ఆపై నిమిషాల వ్యవధిలో వాటిని వెనక్కు తీసుకున్నారని న్యూయార్క్ టైమ్స్ నేటి తన ప్రత్యేక కథనంలో ప్రచురించింది. పత్రిక కథనం ప్రకారం, టెహ్రాన్ పై దాడి చేయాలని ట్రంప్ ఆదేశించారు. ట్రంప్ ఆదేశాలతో యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమవుతున్న వేళ, తిరిగి ఆయన తన ఆదేశాలను ఉపసంహరించుకున్నారు.

 ఇరాన్ లోని కీలక రాడార్లు, మిసైల్ లాంచింగ్ స్థావరాలను ధ్వంసం చేయాలని ట్రంప్ భావించినట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి 7 గంటల సమయం నుంచి వైట్ హౌస్ లో ట్రంప్ రక్షణ శాఖ ఉన్నతాధికారులతో విస్తృత సమావేశాలు జరిపారని, ఇరాన్ దుందుడుకు చర్యకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని భావించిన ట్రంప్ ఈ ఆదేశాలు ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్ ఆదేశాలు అందగానే, పలు యుద్ధ నౌకల్లోని విమానాలు మిసైళ్లను లోడ్ చేసుకుని, బయలుదేరేందుకు సిద్ధమయ్యాయని, ఆపై మళ్లీ ఆదేశాలు రావడంతో వెనక్కు తగ్గాయని పేర్కొంది.

More Telugu News