కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక సీఎం కుమారస్వామి
- నేనెంత బాధపడుతున్నానో చెప్పలేను
- ప్రతి రోజూ బాధను అనుభవిస్తూనే ఉన్నాను
- ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర బాధ్యత నాపై ఉంది
బాధను అనుభవిస్తున్నానన్న కుమారస్వామి ఆ బాధకు కారణం ఏంటన్నది మాత్రం బయటపెట్టలేనన్నారు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రభుత్వం సక్రమంగా నడవాలని, ప్రభుత్వం సేఫ్‌గానే ఉందన్న ఆత్మవిశ్వాసాన్ని అధికారుల్లో నింపాల్సిన బాధ్యత తనపై ఉందని కుమారస్వామి పేర్కొన్నారు. కాగా, కుమారస్వామి గతంలోనూ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వంతో చాలా బాధలు అనుభవిస్తున్నట్టు చెబుతూ గతవారం కన్నీళ్లు పెట్టుకున్నారు.