Garikapati: 'గుండుబాస్ కాదు జగదేకవీరుడే'... లలితా జువెలరీ కిరణ్ పై గరికపాటి ప్రశంసలు!

  • విద్యా విధానంపై గరికపాటి ప్రవచనం
  • డబ్బు సంపాదనకు చదువే ముఖ్యం కాదు
  • ఐదు మాత్రమే చదివిన కిరణ్ గురించి ప్రస్తావన
ప్రముఖ అవధాని, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు లలితా జువెలరీ అధినేత కిరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఓ ప్రవచన కార్యక్రమంలో భాగంగా, విద్యా విధానంపై మాట్లాడిన వేళ, ప్రతి ఒక్కరూ ఎంబీఏలు, ఎంసీఏలు చేస్తామని చెబుతున్నారని, జీవితంలో ఎదగడానికి, డబ్బు సంపాదించడానికి చదువే ముఖ్యం కాదని అన్నారు. ఇటీవల తాను ఓ దినపత్రికలో కిరణ్ పై వచ్చిన వ్యాసాన్ని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఆయన కేవలం 5వ తరగతి మాత్రమే చదివారని, ఇప్పుడు రూ. 10 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని పొగడ్తలు కురిపించారు. అందరూ ఆయన్ను గుండుబాస్ అని పిలుస్తుంటారని, కానీ ఆయన వ్యాపార ప్రపంచంలో జగదేకవీరుడని ప్రశంసించారు.
Garikapati
Kiran
Lalitha Jewellary

More Telugu News