Kona Raghupati: ఏపీ డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి ఏకగ్రీవం... కౌగిలించుకుని అభినందించిన చంద్రబాబు!

  • కేవలం ఒకే ఒక్క నామినేషన్
  • రఘుపతి ఎన్నికైనట్టు ప్రకటించిన స్పీకర్ తమ్మినేని
  • అభినందించిన పలువురు ప్రజాప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొద్ది సేపటి క్రితం స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప సభాపతి ఎన్నికను ప్రస్తావిస్తూ, కేవలం ఒకే ఒక్క నామినేషన్ దాఖలైందని, దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నానని తెలిపారు. ఆయన్ను స్పీకర్ స్థానంలోకి ఆహ్వానించారు. కోన రఘుపతిని సీఎం వైఎస్ జగన్, విపక్షనేత చంద్రబాబు తదితరులు స్పీకర్ స్థానం వద్దకు తీసుకువెళ్లారు. తొలుత జగన్ కోన రఘుపతి స్థానం వద్దకు వచ్చి, ఆత్మీయ ఆలింగనం చేసుకోగా, ఆపై చంద్రబాబు సైతం రఘుపతిని కౌగిలించుకుని అభినందించి, స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా పలువురు పాలక, విపక్ష నేతలు ఆయన్ను అభినందించారు.
Kona Raghupati
Deputy Speaker
Chandrababu
Jagan

More Telugu News