Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • స్పెయిన్ లో కీర్తి సురేశ్ షూటింగ్ 
  • డబ్బింగ్ మొదలెట్టిన చిరంజీవి 
  • 'ఇస్మార్ట్ శంకర్' పాటల చిత్రీకరణ 

*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. నరేంద్రనాథ్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత వారం రోజుల నుంచి స్పెయిన్ లోని వివిధ ప్రాంతాలలో జరుగుతోంది. నలభై ఐదు రోజుల భారీ షెడ్యూలును అక్కడ నిర్వహిస్తున్నారు.
*  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. దీంతో ఈ చిత్రం డబ్బింగ్ మొదలైంది. నిన్నటి నుంచి హైదరాబాదు, శబ్దాలయ థియేటర్ లో చిరంజీవి తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు.
*  రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ మాల్దీవులలో ముగిసింది. అక్కడ రెండు పాటలను చిత్రీకరించామని చిత్ర నిర్మాత చార్మి పేర్కొంది. 

More Telugu News