YSRCP: సీఎం హోదాలో తొలిసారిగా ‘పోలవరం’ వెళ్లనున్న జగన్

షార్ట్స్‌లో చూడండి
పోలవరం ప్రాజెక్టును సీఎం హోదాలో జగన్ తొలిసారి సందర్శించనున్నారు. ఈ నెల 20న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లనున్నారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. కాగా, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల తొలి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, దీని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Go Back to Shorts
YSRCP
cm
Jagan
Polavaram project

More Telugu News