పుల్వామాలో మరో ఘాతుకం... ఆర్మీ వాహనంపై పేలుడు పదార్థాలతో ఉగ్రదాడి
- రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన వాహనంపై దాడి
- కాల్పులతో పాటు రాళ్లు రువ్విన ముష్కరులు
- కొనసాగుతున్న ఎన్ కౌంటర్
పుల్వామా జిల్లాలోని అరిహాల్ గ్రామం సమీపంలో ప్రయాణిస్తున్న 44 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన వాహనంపై ఈ దాడి జరిగింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం... ఈ దాడిలో ఒక వాహనం ధ్వంసమైంది. వెంటనే భారీ ఎత్తున కాల్పులు, రాళ్లు రువ్వడం ప్రారంభమైంది. అనంతనాగ్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయిన గంటల వ్యవధిలోనే... పుల్వామాలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.