ys viveka: వైఎస్ వివేకా హత్య కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు

  • పులివెందుల కోర్టు ఆదేశాలు
  • ఈ నెల 28 వరకు రిమాండ్ విధింపు
  • నిందితులను పులివెందుల సబ్ జైలుకు తరలింపు
వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. ఈ మేరకు పులివెందుల కోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ ను పోలీసులు పులివెందుల సబ్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా, వైఎస్ వివేకా హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఇటీవల సీఎం జగన్ ని ఆయన కుమార్తె సునీత కోరారు. 
ys viveka
murder
case
pulivendula

More Telugu News