Bonda Uma: మా హయాంలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు: బొండా ఉమ మండిపాటు

  • తాము ఉచిత ఇసుక విధానం తెచ్చాం
  • సమీక్ష పేరుతో వైసీపీ ప్రభుత్వం ఇసుక రవాణాను నిలిపివేసింది
  • లోటు బడ్జెట్ ఉన్న ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేశారు
తెలుగుదేశం పార్టీ పాలనలో అవినీతి జరిగిందంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ మండిపడ్డారు. నిర్మాణరంగంపై ప్రభావం పడరాదనే సదుద్దేశంతో తాము ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. వైసీపీ మాత్రం సమీక్ష పేరుతో ఇసుక రవాణాను నిలిపివేసిందని... ఇది చాలా దారుణమని అన్నారు. ఇసుక విధానంపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీని తమ అధినేత చంద్రబాబు అన్ని విధాలా అభివృద్ధి చేశారని చెప్పారు.
Bonda Uma
Chandrababu
ysrcp
Telugudesam

More Telugu News