Mallu Bhatti Vikramarka: తెలివి ఉండే మాట్లాడుతున్నారా? లేక మాట్లాడుతున్నారా?: భట్టిపై తలసాని ఫైర్

  • 15% పనులే పూర్తయ్యాయనడాన్ని తప్పుబట్టిన తలసాని
  • అవినీతిలో కూరుకుపోయిన పార్టీ కాంగ్రెస్
  • ప్రాజెక్టు పనులపై అనుమానాలుంటే వచ్చి చూడండి
తెలివి ఉండే మాట్లాడుతున్నారా? లేక మాట్లాడుతున్నారా? అంటూ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకు పడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 15 శాతం మాత్రమే కాళేశ్వరం పనులు పూర్తయ్యాయని భట్టి వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ కాంగ్రెస్ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రాజెక్టు పనులపై అనుమానాలుంటే ఒకసారి స్వయంగా తిరిగి చూడాలని తలసాని సూచించారు.
Mallu Bhatti Vikramarka
Talasani
Congress
Kaleswaram

More Telugu News