kcr: కారు దిగి ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేసీఆర్

  • విజయవాడ పర్యటనలో కేసీఆర్
  • ప్రకాశం బ్యారేజీని, నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం
  • ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించిన కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ నివాసానికి వెళ్లిన కేసీఆర్... ఆయనతో పలు విషయాలపై చర్చలు జరిపారు. మరోవైపు జగన్ నివాసానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద తన వాహనం నుంచి కేసీఆర్ కిందకు దిగారు. బ్యారేజీని, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించారు. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే.
kcr
prakasam barrage
jagan
vijayawada

More Telugu News