modi: ఉత్సాహంగా ఉండండి.. మీరిచ్చే ప్రతి సలహా మాకు చాలా ముఖ్యం: విపక్ష సభ్యులతో మోదీ
పార్లమెంటులో సంఖ్యాబలం ముఖ్యంకాదని... సభలో విపక్ష సభ్యులు మాట్లాడే ప్రతి మాట తమకు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున ఆయన మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా సభలోని సభ్యులందరూ వ్యవహరించాలని... దేశ సమస్యలను లేవనెత్తాలని కోరారు. సభలో తమకు అధికారపక్షం, విపక్షం అనే తేడా లేదని చెప్పారు. దేశాభివృద్ధి కోసం అందరం నిష్పక్షపాతంగా వ్యవహరిద్దామని పిలుపునిచ్చారు. విపక్ష సభ్యులంతా సభలో చేపట్టే చర్చల్లో ఉత్సాహవంతంగా పాల్గొనాలని చెప్పారు.
సంఖ్యాబలం గురించి విపక్షాలు ఆలోచించవద్దని... మీ ప్రతి మాట, ప్రతి సలహా తమకు చాలా విలువైనదని మోదీ అన్నారు. మంచి ఫలితాలను సాధించే దిశగా ఈ సమావేశాలు కొనసాగుతాయనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
సంఖ్యాబలం గురించి విపక్షాలు ఆలోచించవద్దని... మీ ప్రతి మాట, ప్రతి సలహా తమకు చాలా విలువైనదని మోదీ అన్నారు. మంచి ఫలితాలను సాధించే దిశగా ఈ సమావేశాలు కొనసాగుతాయనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.