cbn army: చంద్రబాబు పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా... అసభ్య రాతలు, మార్ఫింగ్ ఫొటోలు!

  • 'సీబీఎన్ ఆర్మీ కృష్ణా జిల్లా' పేరిట పేజీ
  • వైసీపీలో చంద్రబాబు చేరినట్టు ఫొటో
  • కేసును విచారిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడి పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతాను ప్రారంభించి, అసభ్యకర రాతలు, మార్ఫింగ్ ఫొటోలు పెడుతున్న వైనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, 'సీబీఎన్ ఆర్మీ కృష్ణా జిల్లా' పేరిట ఇటీవల ఫేస్ బుక్ లో ఓ ఖాతా ప్రారంభమైంది. దీనిలో చంద్రబాబుకు సీఎం జగన్ వైసీపీ కండువాను కప్పుతున్నట్టు ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

ఆపై చంద్రబాబు చిత్రానికి పసుపు, కుంకుమ రాసినట్టు ఫొటోలను మార్ఫింగ్ చేసి పెట్టారు. దీన్ని చూసిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై విచారించి, నిందితులను శిక్షించాలని కృష్ణాజిల్లా ఇన్‌ చార్జి పెందుర్తి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్  పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.
cbn army
Krishna District
Fake
Facebook
Police

More Telugu News