Cheeta: తిరుమల ఘాట్ లో భక్తులపై చిరుతపులి దాడి!

  • కనుమదారిలోని హరిణి వద్ద పిట్టగోడపై కూర్చుని ఉన్న చిరుత
  • రెండు వాహనాలపై దాడి.. ఇద్దరికి గాయాలు 
  • కార్లను చూసి పారిపోయిన చిరుత
తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్ లో భక్తులపై చిరుతపులి దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక బాలాజీ నగర్ కు చెందిన వ్యక్తులు, తిరుపతి నుంచి ద్విచక్ర వాహనంపై తిరుమలకు వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. కనుమదారిలోని హరిణి వద్ద పిట్టగోడపై కూర్చుని ఉన్న చిరుత, అటుగా వచ్చిన ద్విచక్ర వాహనంపైకి దూకింది.

ఈ సమయంలో వాహనం వెనుక కూర్చుని ఉన్న పావని అనే యువతి కాలికి గాయమైంది. వారు తప్పించుకుని వేగంగా బండిని నడుపుతూ పైకి ఎక్కేశారు. మరికాసేపటికి అటుగా వచ్చిన మరో బైక్ పైనా చిరుత దాడి చేసి, యామిని అనే మరో యువతిని గాయపరిచింది. అదే సమయంలో కొన్ని కార్లు రావడంతో, వాటిని చూసిన చిరుత పారిపోగా, భక్తులు తప్పించుకోగలిగారు. గాయపడిన వారికి తిరుమల అశ్విని ఆసుపత్రిలో చికిత్స అందించారు.
Cheeta
Tirumala
Tirupati
Piligrims
Attack

More Telugu News